Friday, March 14Thank you for visiting

Tag: kerala News

Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

National
Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. ప‌లు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వ‌ర‌కు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్. టైమింగ్స్ ఇవీ.. ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి - బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవ‌లు అందజేస్తుంది. మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్న...

గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి

Crime
కోచ్చి: కేరళ (Kerala) లోని కొచ్చి లో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యు లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపే వ్యక్తి గూగుల్ మ్యాప్ (Google Map) సాయంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీ వర్షం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం (Accident) సంభవించినట్లు భావిస్తున్నారు. స్థానిక వార్తల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు గోతురుత్ ప్రాం తంలో పెరియార్ నదిలో పడిపోయింది. ఈ ప్రమా దంలో యువ వైద్యులు అద్వైత్ (29), అజ్మల్ (29) మృతిచెందారు. ఈ ప్రమా దంలో కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఈ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. కాగా కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సాయంతో డ్రైవింగ్ చేస్తున్నాడని.. అయ...

Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్

National
కేరళ (kerala) లో నిఫా వైరస్ భయాందోళన సృష్టిస్తోంది. నిపా సోకిన పేషెంట్‌తో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త బుధవారం పాజిటివ్‌ తేలడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్‌ల ( Containment zones )ను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించింది. నిఫా రోగులతో కాంటాక్ట్ అయిన వారి సంఖ్య 700గా ఉండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ 700 మందిలో 77 మంది హైరిస్క్ కేటగిరీలో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో Nipah Virus అప్‌డేట్‌లు 1. హై రిస్క్ ఉన్న నిపా రోగులు తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. 2. కోజికోడ్‌లో పండుగలు, ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు విధించారు. 3. కోజికోడ్ జిల్లా (Kozhikode district) లోని వడకర తాలూకాలోని తొమ్మిది పంచాయతీల్లోని 58 వార్డులను కంటైన్‌మెంట్ జో...

అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..

Trending News
శబరిమల పుణ్యక్షేత్ర సందర్శన కోసం సేవకుడి లైసెన్స్‌ వదులుకున్న రెవరెండ్‌ మనోజ్‌ తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ (Christian pries)‌.. సేవకుడిగా తనకున్న లైసెన్సును (Church licence) వదులుకున్న ఘటన కేరళలోని (Kerala) తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే ఫాదర్ ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో (Anglican Church of India) పనిచేస్తున్నారు. ఆయన కేరళలోని ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని (Sabarimala Temple) సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇతర స్వామి భక్తుల మాదిరిగానే ఆయన కూడా మండల దీక్ష స్వీకరించి కొనసాగిస్తున్నారు. న్నారు. సెప్టెంబరు 20న అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. అయితే దీనిపై స్థానికంగా దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు. మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యమిస్తానని ఇస్తానని మనోజ్‌ చెప్పారు. తన దీక్ష గురించి త...

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

National
  కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు తన కుమారుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు షీజా బేగం భర్త, బంధువులు వాయనాడ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కొడుకును తలుచుకుంటూ మనస్తాపానికి గురైన తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే ఛిద్రం చేస్తా...
Exit mobile version