Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కులకు చెల్లు..
Hyderabad News : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులను దూరం చేయడానిక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు.
మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్డు నెంబర్. 45 , ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ అస్పత్రి జంక్షన్లను జీహెచ్...