Delhi Liquor Scam Case : లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు
Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది. ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా, కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే..
కాగా కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజక...