Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: karimnagar

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Telangana

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

TGSRTC | కరీంనగర్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆదివారం కరీంనగర్ (Karimnagar)  జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎల‌క్ట్రిక్‌ బస్సులను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Parbhakar)  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌మది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్ల‌డించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. కాగా విద్యుత్‌ బస్సుల (Electric Buses)  కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని మంత్రి ...
Telangana

TGSRTC New Electric Buses |ఆర్టీసీ ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో రోడ్ల‌పైకి కొత్త‌గా 1000 ఎలక్ట్రిక్ బస్సులు

New Electric Buses | రాష్ట్రంలో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, కాలుష్య భూతాన్ని క‌ట్ట‌డి చేసే దిశ‌గా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ముందుకు సాగుతోంది. తాజాగా 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కించాల‌ని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం, RTC కింద ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో నడుస్తున్నాయి. 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌లోనే నడిపే అవకాశం ఉంది. ఇతర ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అత్య‌ధిక ట్రాఫిక్ రూట్లలో న‌డవ‌నున్నాయి. హెచ్‌సియు, హయత్‌నగర్‌తో సహా డిపోలలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కొన్ని ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులను డిమాండ్ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు. మరోవైపు ఎంజీబీఎస్‌...
Telangana

పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డు...
Exit mobile version