Jeet Adani : ఏటా 500 మంది వికలాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విరాళం అందిస్తాం..
Jeet Adani : వికలాంగులైన కొత్తగా పెళ్లైన యువతులకు చేయూతనందించేందుకు దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ (Jeet Adani ) ఆయన కోడలు దివా (Diva Shah) ముందుకు వచ్చారు. మంగళ సేవ (Mangal Seva) పేరుతో 500 మంది వికలాంగ యువతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బుధవారం (ఫిబ్రవరి 5) ప్రకటించారు .
జీత్ అదానీ తన వివాహానికి రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన నివాసంలో 21 మంది కొత్తగా వివాహం చేసుకున్న వికలాంగులైన మహిళలను వారి భర్తలను కలిశారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో దివా షాను ఆయన వివాహం (Jeet Adani Diva Shah Wedding) చేసుకోనున్నారు.
ఈ విషయమై గౌతమ్ అదానీ X పై తన ఆనందాన్ని పంచుకున్నారు, జీత్, దివా కలిసి వారి ప్రయాణంలో మొదటి అడుగు ఈ గొప్ప లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. మంగళ సేవ అనేక మంది వికలాంగ మహిళలకు వారి ...