ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, ఆహారం, వరద సమస్యలతో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని Jannayak Janta Party ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంతలో ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళతోపాటు ఇతర స్థానికులు "ఇప్పుడు ఎందుకు వచ్చారు?" అంటూ ప్రశ్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్...