Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..
Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క - సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కాగా మేడారం వచ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జంపన్నవాగు, తోపాటు ఇక్కడి స్టాళ్లు, ఎగ్జిబిషన్లను చూసి వెళ్తుంటారు. అయితే ఇవే కాకుండా మేడారం ప్రాంతంలో ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలను కూడా దర్శించుకోవచ్చు. జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తుల...