
Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు
Assembly Elections | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఇది 2014 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మూడు దశల్లో ఎన్నికలు
జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి; సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది" అని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.జమ్మూ కాశ్మీర్ ఓటర్ల వివరాలు.. జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 74 జనరల్, ఎస్టీలు 9, ఎస్సీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇక ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్...