Indore Lok Sabha | ఎన్నికల్లో ఓటువేస్తే రుచికరమైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అందజేస్తారట..
Indore Lok Sabha : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఫుడ్ షాపుల యజమానులు వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభ సమయంలో ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలు, ఐస్‌క్రీం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ (Indore Lok Sabha) లో మే 13న పోలింగ్ జరగనుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ వాణిజ్య సంస్థల సమావేశంలో ఉచిత ఆహార పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు దుకాణ యజమానులు తెలిపారు.
సమావేశం అనంతరం ఆశిష్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటింగ్‌లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకుంటున్నామని, ఇందుకోసం వాణిజ్య సంస్థల సహకారం తీసుకుంటున్నామని ఆయన అన్నారు. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఓటు వేసే ప్రజలకు ఉచితంగా పోహా, జిలేబీలు అందజేస్తామని నగరంలో...