UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?
UP Police Bharti Exam Result 2024 : ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడవచ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష కటాఫ్ 214కి పెరిగింది. ఈ పరీక్షలు ఆగస్టు 23, 24, 25, 30, 31వ తేదీల్లో జరిగాయి. ఆ తర్వాత ఈ పరీక్ష ఫలితం కోసం అభ్యర్థులు వేచి చూస్తున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఈ పరీక్ష ఫలితాలు ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి..
UP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
మీరు UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రాసి ఉంటే మీరు...