ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?
ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు.
FY2023-24కి ITR ఫైలింగ్ గడువు ఎంత?
అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు . గడువు కంటే ముందే తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులకు ఇమెయిల్‌లు, మెసేజ్ ల ద్వారా ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ జూలై 31, 2024.
“మీరు ఇంకా ఫైల్ చ...