Donald Trump : ఆ నరకానికి ముగింపు పలుకుతాం.. ! హమాస్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్..
Donald Trump : డోనాల్డ్ ట్రంప్ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను జనవరి 20న వైట్‌హౌస్‌లో బాధ్యతలు స్వీకరించేలోపు ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ బందీలను విడుదల చేయకుంటే ‘నరకం అంతమవుతుంది’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు.
మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. హమాస్ బందీలను విడుదలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. "ఇది హమాస్‌కు మంచిది కాదు. ఇది ఎవరికీ మంచిది కాదు. హమాస్ ఇప్పటికే బందీలను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది హత్యకు గురయ్యారు.
"వారు ఇకపై బందీలుగా ఉండరు.. నాకు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వ్యక్తులు, ఇతరులు కాల్ చేస్తున్నారు, వాళ్లను కాపాడాలని వేడుకుంటున్నారు. అక్కడ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వారిని కూడా బందీలుగా చేశారు. వాళ్ల తల్లులు నా దగ్గరకు వచ్చార...