Wednesday, April 30Thank you for visiting

Tag: Israel – Palestine Conflict

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

World
Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాప...

What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..

World
What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉన్న అనేక సొరంగాలను బహిర్గతం చేశాయి, హమాస్ ఉగ్రవాదులు ఎవరూ గమనించకుండా ఈజిప్టు భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించారని ఆరోపించారు. ఆ సొరంగాల గురించి ఈజిప్ట్ ప్రభుత్వానికి తెలుసునని ఇజ్రాయెల్ ICJ విచారణలో పేర్కొంది. మే 26న (స్థానిక కాలమానం ప్రకారం) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగి...

Israel Palestine conflict: ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? పాలస్తీనాతో వివాదం ఎందుకు? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?

Special Stories
వందేళ్లుగా రగులుతున్నమారణహోమానికి కారణాలేంటీ...? Israel Palestine conflict : ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అలాగే నిర్విరామంగా ఇప్పటికీ కొనసాగుతున్న సంఘర్షణలలో ఒకటి. ఈ ప్రాంతంలో యుద్ధాలు, విధ్వంసం, రక్తపాతం కలిగించే ఘోరమైన ఘటనలు నిరంతరం చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఎలా మొదలైంది? పాలస్తీనా - ఇజ్రాయెల్ చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.. ఇజ్రాయెల్ నేడు పశ్చిమాసియాలోని ఒక చిన్న దేశం. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మేఘాలయ లేదా మణిపూర్ పరిమాణంలో ఉంది. ఇజ్రాయెల్ కు పశ్చిమాన మధ్యధరా సముద్రం, దక్షిణాన ఈజిప్ట్, తూర్పున జోర్డాన్, సిరియా.. ఉత్తరాన లెబనాన్ సరిహద్దులుగా ఉంది. ఇజ్రాయెల్‌లో యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న అనేక పవిత్రక్షేత్రాలు ఉన్నాయి నేడు, ఇజ్రాయెల్ జనాభాలో ఎక్కువగా యూదులు ఉన్నారు. మ...

మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక

World
న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్‌ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి" అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు. గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది. ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, "పరిస్థి...

ఒకప్పుడు ఇజ్రాయెల్ పై తటస్థంగా ఉన్న భారతదేశం ఇప్పుడు మిత్రుడిగా ఎలా నిలిచింది..? మన మద్దతు పాలస్తీనా నుంచి Israel కు ఎలా మారింది.?

Special Stories
India-Israel relations: భారత దేశ చరిత్రలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులను  కార్గిల్ యుద్ధ సమయంలో ఎదుర్కొంది.  మే 3, 1999న, జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్-ద్రాస్ సెక్టార్‌లో పాకిస్తానీ దళాల చొరబాటు గురించి భారతదేశానికి తెలిసింది. మూడు వారాల తర్వాత, ఆపరేషన్ విజయ్ అనే కోడ్ పేరుతో మనదేశం ఎదురుదాడిని ప్రారంభించబడింది. అయితే, కాలం చెల్లిన సైనిక, సాంకేతిక పరికరాలు కలిగిన భారత రక్షణ దళాలకు వ్యూహాత్మక ప్రదేశాల్లోని బంకర్లలో దాక్కున్న పాకిస్తానీ సైనికులను గుర్తించడం.. వారిపై దాడి చేయడం  చాలా కష్టంగా మారింది. సహాయం కోసం భారత్  అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే 1998లో అణ్వాయుధ పరీక్షలు చేపట్టిన కారణంగా అమెరికా నేతృత్వంలోని దేశాలతో సాంకేతిక, ఆర్థిక, ఆయుధాలకు సంబంధించి  మన దేశం ఆంక్షలను ఎదుర్కొంటోంది. అంతటి క్లిష్ట సమయంలో కేవలం ఒక్క దేశం మాత్రమే భారత్‌కు బహిరంగంగా మద్దతుగా నిలిచింది.. అదే ఇజ్రాయెల్(I...

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...
Exit mobile version