మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక
న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి" అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు.
గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది.
ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, "పరిస్థి...