Tuesday, March 4Thank you for visiting

Tag: IRCTC

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు.. ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్). సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...

IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..

Trending News
IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) - రామేశ్వరం - తిరువనంతపురం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. . దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3A...

IRCTC News : హరిద్వార్ కన్వర్ మేళా కోసం ప్రత్యేక రైళ్లు 

National
IRCTC News | న్యూఢిల్లీ: హరిద్వార్‌లో జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జ‌రిగే కన్వర్ మేళాను దృష్టిలో ఉంచుకుని భక్తుల‌ సౌకర్యార్థం ఉత్తర రైల్వే జూలై విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. కన్వారియాల కోసం ఉత్తర రైల్వే రైలు నెం 04465/66 (ఢిల్లీ-షామ్లీ-ఢిల్లీ), 04403/04 (ఢిల్లీ-సహారన్‌పూర్-ఢిల్లీ) రైళ్ల‌ను హరిద్వార్ వరకు పొడిగించింది. అలాగే మేళా కోసం ఐదు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కన్వర్ మేళా కోసం హరిద్వార్‌కు ప్రత్యేక రైళ్లు రైలు నెం. 04322 (మొరాదాబాద్-లక్సర్-మొరాదాబాద్) రైలు నెం. 04324 (హరిద్వార్-ఢిల్లీ-హరిద్వార్) రైలునెం. 04330 (రిషికేశ్-ఢిల్లీ-రిషికేశ్) రైలు నెం. 04372 (రిషికేశ్-లక్నో చార్‌బాగ్-రిషికేశ్) రైలు నెం. 04370 (రిషికేశ్-బరేలీ-రిషికేశ్) మేళా సందర్భంగా, ఉత్తర రైల్వే 14 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంద‌ని, ఎక్కువ మంది ప్ర‌యాణించేందుకు వీలుగా 24 రైళ్లకు అద...

IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్‌ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్

Trending News
IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్ర‌మాదం ఉంది. రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు మంచి ఉద్దేశంతో ఇత‌రులకు టికెట్‌ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇక‌పై నేరంగా పరిగణించనున్నారు. చట్టపరమైన శిక్ష‌ల‌ను ఎదుర్కోకుండా ఉండటానికి తాజా నిబంధ‌న‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం, అధికారికంగా నియమించబడిన ఏజెంట్లకు మాత్రమే థ‌ర్డ్‌ పార్టీల కోసం బుకింగ్‌లు చేయడానికి అధికారం ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించవ‌చ్చు. ఇతరులకు IRCTC టికెట్ బుకింగ్‌పై పరిమితులు క...

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో మ‌రో 12 రైల్వేస్టేష‌న్ల‌లో త‌క్కువ ధ‌ర‌లో ఎకానమీ మీల్స్..

Trending News
South Central Railway Economy Meals | రైలు ప్రయాణీకులకు సరసమైన, నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారాన్నిఅందించేందుకు భార‌తీయ రైల్వే శాఖ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ భోజనాలు ప్లాట్‌ఫారమ్‌లపై సాధారణ కోచ్‌ల వ‌ద్ద అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణికులకు త‌క్కువ ధ‌ర‌లోనే నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో కలిసి "ఎకానమీ మీల్స్ ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లలో ప్రయాణించే వారికి త‌క్కువ‌ ధరలో రెండు రకాల భోజనాలు అందిస్తోంది. ఈ భోజన కౌంటర్లు ఇప్పుడు భారతీయ రైల్వేలలో 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్లలో పనిచేస్తున్నాయి. కొత్త‌గా చేర్చిన స్టేష‌న్లు ఇవే.. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో కొత్తగా 12 స్టేషన్లలో ఎకాన‌మీ మీల్స్‌ అందించడం ప్రార...

Train Ticket Booking | ప్రయాణీకుల కోసం రైల్వే కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరు మీకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు.

Trending News
Train Ticket Booking | ప్రతిరోజూ కోట్ల మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు. కానీ రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు, మీరు కావాలనుకున్న లేదా ఎంపిక చేసుకున్న సీటును మీరు పొందగలరా?  ఈ సమస్యకు IRCTC అతి త్వరలో పరిష్కారం చూపుతుంది. ఇప్పుడు, సినిమా హాళ్లు లేదా విమానాల మాదిరిగా, మీరు రైలులో కూడా మీకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన సీటును మీరు ఎంచుకోవచ్చు: ఈ విషయం గురించి రైల్వే అధికారి మాట్లాడుతూ సినిమా టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు మీకు నచ్చిన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చని, అదేవిధంగా, రైలు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు, మీరు పైభాగంలో లేదా మధ్య, దిగువ సీటును బుక్ చేసుకోగలుగుతారు. దీనికి అవసరమైన అన్ని వ్యవస్థలను IRCTC దాదాపుగా సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. సీట్లు ఎలా బుక్ చేయబడతాయి: IRCTCలో నేరుగా బుక్ చేస్తున్నప్పుడు, మీకు ఖాళీగా ఉన్న అన్ని సీట్ల జాబితా డిస్ప్లే చేస్తుంది. అటువంటి ...

IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

Andhrapradesh
IRCTC Shirdi Tour From Vijayawada: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రధానంగా అధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారి కోసం అతితక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ప్యాకేజీలను తీసుకొస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. టూర్ షెడ్యూల్ : Day 1: మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స...

IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్‌ రూమ్‌ లాంటి గది, రూ.100తో బుక్‌ చేయొచ్చు

National
  IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్‌ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి, భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న చాలా వసతుల గురించి సరైన అవగాహన ఉండడం లేదు. మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గానీ, కునుకు తీయడాని గానీ, లేదా స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి కాసేపు రెస్ట్ తీ కోసం ఒక గదిని కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే హోటల్ రూంం వంటి గదిలో గడపొచ్చు. కేవలం రూ.100కే రూమ్‌ బుకింగ్‌ రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను IRC...

హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి

National
ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి. "వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది... 2024 ప్రారంభంలో వస్తుంది’’ మంత్రి (Railway Minister, Ashwini Vaishnaw) కూలో రాశారు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, అధునాతన భద్రతా ఫీచర్లతో సహా అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని భావిస్...

Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Crime
Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో " నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ "ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ చేయడానికి గ్యా...
Exit mobile version