Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం
Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువలను గణనీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.
Navratna status : నవరత్న హోదాతో లాభమేంటి?
కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని లభిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుత...