Indore | కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ అభ్యర్థి..
Indore | లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి (Congress) వరుసగా గట్టి షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బాబ్ (Akshay Kanti Bamb) తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్ వర్గియ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్‌కాంతిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లుఆయన పేర్కొన్నారు. అక్షయ్ తనతో ఉన్న ఫొటోను ట్యాగ్ చేశారు. కాగా ఇండోర్ లో నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఓటింగ్ జరగనుంది. సోమవారంమే నామినేషన్ల చివరి రోజు.
కాగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ సహా ముగ్గురు అభ్యర్థులు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ విలేకరులతో అన్నారు. అక్షయ్ బామ్ తన అభ్యర్థిత్వాన్...