Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
Indiramma Housing Scheme | రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే నాలుగేళ్లలో దశల వారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు.
ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఇక రెండో దశలో ప్రభుత్వమే నివాస స్ధలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. ఇందులో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం...