Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Indira Gandhi

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం
National

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు. "తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కాగా "నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద...
National

Samvidhaan Hatya Diwas | కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై ఏటా జూన్ 25న ‘సంవిధాన్ హత్యా దివస్’

New Delhi | 1975లో అప్పటి  ప్రధాన మంత్రి మంత్రి ఇందిరా గాంధీ విధించిన 'ఎమర్జెన్సీ'  కారణంగా అనేక కష్టాలు అనుభవించిన వారందరి కోసం ఏటా జూన్ 25 న 'సంవిధాన్ హత్యా దివస్ ( Samvidhaan Hatya Diwas)'గా జరుపుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్ణయించింది. "జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, తన నియంతృత్వ ధోరణితో దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యం  ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేసారు" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌(X)లో రాశారు. “భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25ని 'సంవిధాన్ హత్యా దివస్'గా జరుపుకోవాలని నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ప్రజల అమానవీయ బాధను, సహకారాన్ని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది, ”అన్నారాయన. ఏ తప్పు లేకుండా లక్షలాది మందిని కటకటాల వెనక్కి నెట్టారని, మీడియా గొంతు నొక్కారని అమిత్ షా అన్నారు. 'సంవిధాన్ హత్యా దివస్' పాటించడం...
National

Katchatheevu Island | క‌చ్చ‌దీవుపై ఎందుకీ చ‌ర్చ‌.. ? ఈ ద్వీపం చ‌రిత్ర‌ ఏమిటీ?

Katchatheevu Island | 2024 లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీపై మ‌రో వివాదం చుట్టుముట్టింది. ఇటీవ‌ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కచ్చతివు ద్వీపం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భారత దేశాన్ని విడదీసి, భారత్​లో ఒక భాగమైన ద్వీపాన్ని.. అప్ప‌టి కాంగ్రెస్​ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని విమ‌ర్శించారు. దీంతో అంద‌రి దృష్టి ఒక్క‌సారిగా ఈ కచ్చతివు వివాదంపై ప‌డింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ క‌చ్చ‌తివు ద్వీపం ఏమిటీ ..దీని పూర్వ‌ప‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... కచ్చతీవు ద్వీపం ఎక్కడ ఉంది? కచ్చతీవు భారతదేశం- శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో జనావాసాలు లేని ఒక‌ ద్వీపం. దీని పొడవు 1.6 కిమీ కంటే ఎక్కువ ఉండదు. ఇది భారత తీరం నుండి 33 కి.మీ దూరంలో రామేశ్వరానికి ఈశాన్యంగా ఉంది. ఇది శ్రీలంక ఉత్తర కొన వద్ద జాఫ్నాకు నైరుతి దిశలో 62 కి.మీ దూరంలో ఉంది. శ్రీలంకకు చెందిన డెల్ఫ్ట్ ద...
Exit mobile version