Indian Street Food | ఆటోమెటిక్ గా పానిపూరీ అందించే యంత్రం.. సోషల్ మీడియాలో వైరల్..
Pani-Puri | భారతదేశంలో పానీ పూరీపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే.. సాయంత్రం అయిందంటే చాలు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా పానీ పూరి బండి వద్దకు చేరుతారు.. ఈస్ట్రీట్ ఫుడ్ కరకరలాడే పూరీ, అద్భుతమైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఫిదా చేస్తుంది. అయితే ఇప్పుడు, బెంగుళూరులో ఆటోమేటిక్ పానీ పూరీ వెండింగ్ మెషీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ Pani-Puri వెండింగ్ మెషీన్ ఫొటో బెంగళూరులోని హోసూర్-సర్జాపూర్ రోడ్ లేఅవుట్‌లో తీశారు. దీనిని ప్రముఖంగా హెచ్‌ఎస్‌ఆర్ అని పిలుస్తారు. ఇది మొదట @benedictgershom అనే 'X' ఎకౌంట్ నుంచి షేర్ అయింది. చాలా మంది నెటిజన్లు ఈ స్టాల్ ఉన్న ప్రదేశం గురించి ఆరా తీశారు. దానికి వినియోగదారుడు సెక్టార్ 6లోని హెచ్‌ఎస్‌ఆర్ హై స్ట్రీట్‌లో ఉందని బదులిచ్చారు.
వినియోగదారు షేర్ చేసిన ఫొటోను పరిశీలిస్తే.. ఈ యంత్రం 'WTF - వాట్ ది ఫ్లేవర్' అనే కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోం...