తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision
Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (తమిళనాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Cabinet Decision :17 భారీ వంతెనలు
ఈ ప్రాజెక్టులో 17 మేజర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...