Indian Railways Latest Update | 7 రైల్వే స్టేషన్ల పేర్లు మారిపోతున్నాయ్.. అవేంటో తెలుసా..
Indian Railways Latest Update : భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం ఏడు రైల్వే స్టేషన్‌లపేర్లను త్వరలో మార్చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కూడా ఆమోదించింది. స్టేషన్ పేరు మార్చడానికి, స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరిగా MHA నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ స్టేషన్లు పేరు మార్చారు.
పేరు మార్చే ప్రక్రియ ఇదీ..
రైల్వే మంత్రిత్వ శాఖ స్వంతంగా స్టేషన్ల పేర్లను మార్చడం వీలు కాదు. ఈ ప్రతిపాదనను స్టేషన్ యంత్రాంగం ప్రారంభించాల్సి ఉంది. ఒక నిర్దిష్ట పేరు రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన తర్వాత, తదుపరి ఆమోదం కోసం ప్రతిపాదన MHAకి పంపుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖను లూప్‌లో ఉంచుతూ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలుపుతుంది. హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రక...