Friday, March 14Thank you for visiting

Tag: India

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

National
పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు. "వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ...

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

Trending News
తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోతే తన...

జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

Crime
నలుగురు నిందితుల అరెస్ట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు. బాలిక శనివారం అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్‌పూర్ చేరుకున్నారు...

ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

Andhrapradesh, Local
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు. ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథ సంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆ...

పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

Telangana
ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డు...

వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు

Telangana
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...

జూన్ 20న జగన్నాథ రథయాత్ర

Telangana
ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ Secunderabad's Shree Jagannath Rath Yatra :  హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు. అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం...
Exit mobile version