Tuesday, July 1Welcome to Vandebhaarath

Tag: India

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్
Telangana

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

 హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...
పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి
Crime

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి.ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది.నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు.దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...
రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
Telangana

రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశంహైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు.వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు.30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా ...
బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ
Crime

బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ

Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు బెంగళూరులో మరణించిన మోడల్‌ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ  డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని కెంపపురాలో జూలై 21న బాధితురాలు విద్యాశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. డైరీలో బాధితురాలు తన మరణానికి ప్రియుడే కారణమని పేర్కొంది. దీంతో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డైరీలో ఏముంది? డైరీలో, బాధితురాలు అక్షయ్ తనతో "కుక్కలాగా ప్రవర్తించాడు" అని పేర్కొంది. తనకు చెల్లించాల్సిన సుమారు 1.76 లక్షల మ...
67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..
National

67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..

ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ.. పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 వార్డులు డ్రగ్ అమ్మకందారులను వ్యతిరేకిస్తూ వారిని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. తమ గ్రామాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని తీర్మానించుకున్నాయి. దీని వెనుక పంజాబ్ పోలీసుల కష్టం ఎంతో ఉంది.రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్...
మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు
National

మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు.మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది."ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది" అని చీఫ్ సెక్రటరీ తెలిపారు.మయన్మార్ జాతీయులు శని, ఆది...
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..
National

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో లైవ్ బుల్లెట్, 4 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మూడో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకీగా గుర్తించారు."వీరిద్దరినీ పట్టుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. వారి అరెస్టుపై ఒక్కొక్కరికి రూ...
కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ
Trending News

కొడుకు కాలేజీ ఫీజు కోసం బస్సు కిందపడి ప్రాణాలను తీసుకున్న మహిళ

తమిళనాడులో హృదయవిదారక ఘటన సృష్టిలో తల్లి ప్రేమ మందు ఏదీ సాటిరాదు. తన పిల్లల కోసం ఏం చేయడానికైనా మాతృమూర్తులు వెనుకాడరు. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేస్తారు. తన కొడుకు కాలేజీ ఫీజులను సమకూర్చేందుకు ఓ మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు కింద పడి ప్రాణాలను తీసుకుంది. పిల్లల ఫీజుల కోసం తనను తాను చంపుకోవడం హృదయాలను కలిచివేసింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన దృశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తమిళనాడులో ఓ మహిళ తన కుమారుడి చదువు కోసం డబ్బు సమకూర్చేందుకు బస్సు కిందకు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. సేలం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో 'సఫాయి కర్మచారి' (క్లీనింగ్ స్టాఫ్)గా పనిచేస్తున్న ఒక మహిళ ఉద్దేశపూర్వకంగా బస్సు ముందు దూకినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.యాక్సిడెంట్‌లో చనిపోతే తన...
జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం
Crime

జోధ్‌పూర్‌లో దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదురుగానే బాలికపై ముగ్గురు విద్యార్థుల సామూహిక అత్యాచారం

నలుగురు నిందితుల అరెస్ట్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి వెళ్తున్న 17 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు కళాశాల విద్యార్థులు అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందు బాధితురాలి ప్రియుడిపై ముగ్గురు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. అయితే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన స్వస్థలమైన జోధ్‌పూర్‌లో జరిగిన ఈ సంఘటన గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఉమేష్ మిశ్రాతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు సత్వరమే అరెస్టు చేయడం అభినందనీయమని గెహ్లాట్ అన్నారు.బాలిక శనివారం అజ్మీర్‌కు చెందిన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వారు బస్సులో బయలుదేరి రాత్రి 10:30 గంటలకు జోధ్‌పూర్ చేరుకున్నారు...
ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..
Andhrapradesh, Local

ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో శునకాలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్నాయి. తాగా ఓ ఐదేళ్ల బాలుడు, అతడిని రక్షించేందుకు వెళ్లిన 45 ఏళ్ల వ్యక్తిపై వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ సంఘటన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేపగుంట సమీపంలోని పొర్లుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల కథన ప్రకారం.. ఐదేళ్ల రిత్విక్ తన ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతడిపై కుక్కల గుంపు దాడిచేయగా తలపై, వీపుపై గాయాలయ్యాయి. నాగరాజు అనే 45 ఏళ్ల వ్యక్తి బాలుడిని రక్షించేందుకు వెళ్లగా అతడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గమనించి వెంటనే వారిని ఇద్దరినీ గోపాలపట్నం పీహెచ్‌సీలో చేర్చారు.ఇది కూడా చదవండి:  ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..  Cafe Coffee Day విజయగాథసంఘటన అనంతరం స్థానికులు మాట్లాడుతూ వేపగుంట వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి, మార్కెట్, పాఠశాలలు, దేవాలయాలు, ఆ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..