Friday, March 14Thank you for visiting

Tag: India

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Telangana
Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...

Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..

National
Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు. వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ...

రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన

Local
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండ...

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్‌ వివరాలు తెలుసుకోండి

National
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లో ఫుల్లీ ఎయిర్కండిషన్డ్ ఉంటుంది. వందే భారత్ రైలు మొదట జనవరి 17, 2019న ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఉచిత వైఫై కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, సూపర్ కంఫర్టబుల్ సీట్లు, పరిశుభ్రమైన భోజనం వంటి అనేక సౌకర్యాలు, ఫీచర్లతో ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి, మొత్తం సంఖ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 23కి చేరుకుంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లిస్ట్ చూడండి.. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎ...

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Telangana
  హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు. పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి. కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి ...

పోలీసులపైనే వేటకొడవల్లతో దాడి.. ఎంకౌంటర్ లో ఇద్దరు కరడుగట్టిన నేరస్థుల మృతి

Crime
చెన్నై సమీపంలోని గుడువాంచేరిలో మంగళవారం వాహన తనిఖీ డ్యూటీ లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై  ఇద్దరు రౌడీ షీటర్లు వేట కొడవల్లతో దాడి చేయడంతో  పోలీసులు కాల్పులు జరుపగా ఇద్దరు  చనిపోయారు. మృతులు రమేష్, చోటా వినోద్ ఇద్దరూ కరడుగట్టిన నేరస్థులు.. వీరిపై గతంలో హత్య, దోపిడీ, గూండాయిజం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వేగంగా వచ్చిన బ్లాక్ స్కోడా కారు సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ను ఢీకొట్టేందుకు ప్రయత్నించింది. అయితే కారు అతనికి బదులుగా పోలీసు జీపును ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు కారులోంచి దూకి పోలీసులపై దాడి చేయడంతో శివగురునాథన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అతని తలపై దాడికి యత్నించగా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిందపడిపోయాడు. దీంతో అప్రమత్తం అయిన శివగురునాథన్, మురుగేశన్ కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ...

రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

Telangana
52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన  5,557 విద్యుత్ స్తంభాలు పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశం హైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు. వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు. 30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా ...

బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ

Crime
Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు బెంగళూరులో మరణించిన మోడల్‌ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ  డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని కెంపపురాలో జూలై 21న బాధితురాలు విద్యాశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. డైరీలో బాధితురాలు తన మరణానికి ప్రియుడే కారణమని పేర్కొంది. దీంతో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డైరీలో ఏముంది? డైరీలో, బాధితురాలు అక్షయ్ తనతో "కుక్కలాగా ప్రవర్తించాడు" అని పేర్కొంది. తనకు చెల్లించాల్సిన సుమారు 1.76 లక్షల మ...

67 గ్రామాలు డ్రగ్స్ అమ్మేవారిని సామాజికంగా బహిష్కరించాయి..

National
ముమ్మర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలతో పంజాబ్ పోలీసులు సాధించిన విజయం ఇదీ.. పంజాబ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేసి వారి హింసాత్మక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ముప్పును నివారించేందుకు పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. విస్తృతంగా తనిఖీలు కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. అయతే వీరి ప్రయత్నాలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా సంగ్రూర్ జిల్లాలోని సుమారు 67 గ్రామాలు, 20 వార్డులు డ్రగ్ అమ్మకందారులను వ్యతిరేకిస్తూ వారిని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించాయి. తమ గ్రామాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాలని తీర్మానించుకున్నాయి. దీని వెనుక పంజాబ్ పోలీసుల కష్టం ఎంతో ఉంది. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేని, నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్...

మయన్మార్ నుంచి మళ్లీ భారీగా అక్రమ వలసలు

National
ఎలాంటి పత్రాలు లేకుండా 700 మంది మణిపూర్‌లోకి ప్రవేశం వారిని వెనక్కి పంపాలని అస్సాం రైఫిల్స్ డిమాండ్ మయన్మార్ దేశంలో సైన్యానికి, పౌరులకు మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మయన్మార్ దేశానికి చెందిన 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా 718 మంది మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి ప్రవేశించారు. మయన్మార్ జాతీయులను వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌ను కోరిందని, మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా ఈ 718 మంది మయన్మార్ జాతీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎందుకు.. ఎలా అనుమతించారనే దానిపై స్పష్టం చేయడానికి ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. "ఆ 718 అక్రమ మయన్మార్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రైఫిల్స్‌కు ఖచ్చితంగా సూచించింది" అని చీఫ్ సెక్రటరీ తెలిపారు. మయన్మార్ జాతీయులు శని, ఆది...
Exit mobile version