Video | విస్తారమైన వర్షాలతో ఆనందంతో వరదనీటిలో స్టెప్పులు వేసిన రైతన్న..
India weather | భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉపశమనంతోపాటు విపత్తు రెండింటినీ తీసుకువచ్చాయి. తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి, పలుచోట్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి.
అయితే గుజరాత్ లోని కుత్బుల్లాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు వరంగా మారాయి. ఏళ్ల తరబడి కరువు కాటకాలతో విలవిలలాడిన ఈ ప్రాంతం ఎట్టకేలకు భారీ వర్షాలతో తడిసిన భూమిని చూస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం స్థానిక రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఓరైతు తన కొడుకుతో కలిసి డాన్స్ చేసిన దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సంప్రదాయ దుస్తులు ధరించి, తెల్లటి ధోతీలో రైతు, అతని కుమారుడు నల్ల టీ షర్టు, ప్యాంటుతో వరద నీటిలో స్టెప్పులు వేస్తూ కనిపించారు. సాంప్రదాయ గుజరాతీ పాటకు వీరింద్దరూ ఉత్సాహంగా డాన్స్.. చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆ...