Mohan Bhagwat : దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం
Pahalgam Terror Attack : అహింసా ధర్మం హిందూ మతంలో పాతుకుపోయిందని, కానీ దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం విధిలో భాగమని హిందూ మతం చెబుతుదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. శనివారం ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అహింస సూత్రాలు ప్రజలు ఈ ఆలోచనను స్వీకరించడంపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.చాలా మంది ఈ సూత్రాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు, మరికొందరు అలా చేయరు. సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. అటువంటి పరిస్థితిలో, దాడి చేసేవారి చేతిలో ఓడిపోకుండా ఉండటం కూడా ధర్మం (కర్తవ్యం)లో ఒక భాగమని మతం చెబుతుంది. గూండాలకు గుణపాఠం చెప్పడం కూడా మన విధిలో ఒక భాగం అని స్పష్టం చేశారు..
పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే..
భారతదేశం తన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయలేదని, కానీ ఎవరైనా చెడు తలపెడితే దానికి వేరే మార్గం లేదని...