Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేటపుడు ప్రతీఒక్కరూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి సమాజం గురించి ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే పదాలను వాడడంతో ఆయనపై ఇండి కూటమి నాయకులు విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మళ్లీ మళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. ద...