అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు
అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు
రూ.20వేల నుంచి 30వేల వసూలు
18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన 18 మందిని అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్ధు, మోరం అరవింద, మోరం శ్రీని వాస్ మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు,...