Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: hyderabad

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..
Telangana

Power Outages | హైద‌రాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..

Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమ‌వారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా  ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చిన‌ట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు  అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను తీసుకువచ్చారు. ఇవి 24 గంటల పాటు సేవ‌లందిస్తాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 ట...
Crime

Secunderabad : ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

Secunderabad : సికింద్రాబాద్‌లో ఆదివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు ముత్యాలమ్మ ఆలయం (Muthyalama temple) లో విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించినట్లు సమాచారం. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయం నుంచి పెద్ద శబ్దం విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతడిని పోలీసులకు అప్పగించారు. ఉదయం నుంచి గుడి దగ్గర గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలు.. అక్రమార్కులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ముత్యాలమ్మ గుడి (Muthyalama temple) పై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఒక‌ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ‌ ఇచ్చిన సమాచార...
Telangana

TGSRTC | ఆర్టీసీ టికెట్ ధ‌ర‌ల పెంపుపై వీసీ స‌జ్జ‌నార్ ఏం చెప్పారంటే..

TGSRTC | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ (Sajjanar) స్ప‌ష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించింది. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది, త‌దిత‌ర స‌మయాల్లో హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణికులు ఎక్కువ‌గా సొంతూళ్ల‌కు వెళ్తుంటారు. ఈ సంద‌ర్బాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్య స్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. ప్ర‌యాణికుల‌ రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు న‌డిపిస్తుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి...
Telangana

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోక‌ల్ ట్రైన్స్ వ‌ల్ల క‌లుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర‌వేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్ర‌తిరోజు సుమారు 50 ...
Telangana

Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Hyderabad | రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం (Real Estate)  నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావ‌డంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేప‌ట్ట‌డంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జా...
Career

Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ  దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం  నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స...
Trending News

హైదరాబాద్‌ ‌ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి విగ్రహం ధ్వంసం

Durga Devi Mandir attack | హైదరాబాద్‌ ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దేవీ శరన్నవరాత్రోత్సవాల (Durga Devi) సందర్భంగా ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఉదయాన్నే స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి నిర్వాహకులకు సమాచారం అందించగా , నిర్వాహకులతోపాటు భక్తులు హిందూ సంఘాలుఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. స్థానికుల సమాచారంతో బేగంబజార్‌ ‌పోలీసులు  కూడా నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో దుండగులు.. మొదట అక్కడ కరెంట్ సరఫరా కట్ చేసి ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత దుర్గాదేవి అమ్మవారి విగ్రహం చేతిని వ...
Telangana

TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు. దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ...
Telangana

Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

Hydra News : హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి (హైడ్రా) ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్‌ చేర్చుతూ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ జారీ అయింది. దీనికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం క‌బ్జాదారుల‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూత‌న సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బ‌దలి చేయాల‌ని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ ...
Telangana

Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ Musi Beautification  | కాంగ్రెస్ స‌ర్కారు పేద‌ల ఇండ్ల‌ను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు కాక‌ముందే పేదల కాల‌నీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చ‌డానికి కుట్ర ప‌న్నింద‌ని విమ‌ర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింద...
Exit mobile version