గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్ 25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ ప్రయాణా...