Hyderabad MMTS : గ్రేటర్ లో భారీగా తగ్గిన ఎంఎంటీఎస్ సర్వీసులు.. .
Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటున్న హైదరాబాద్ వాసులకు చుక్కెదురవుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్రమంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండడంతో ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు కష్టాలు ఎదురవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసులను తగ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇందుకు కారణం.. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోకల్ ట్రైన్స్ వల్ల కలుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్రతిరోజు సుమారు 50 ...