Hyderabad Metro Rail : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు.
బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో 'Me Time On My Metro' పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చ...