Tuesday, March 4Thank you for visiting

Tag: HYD Metro

HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

Telangana
HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ముం...

Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

Telangana
Telangana Cabinet Decisions : సచివాలయంలో  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు,  కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై  మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా  అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్...

Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!

Telangana
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ లో  ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వం మెట్రో రైల్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో రెండో దశ మెట్రో లైన్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న  పలు మార్గాల్లో మెట్రో  ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో నాగోల్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు దాదాపు 14 కిలో మీటర్ల మెట్రోను నిర్మించేందుకు రూట్ ను  ఖరారు చేసిట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని  పొడిగించే విధంగా ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ లైన్ నాగోల్ మెట్రో స్ట...

HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?

Telangana
HYD Metro | హైదరాబాద్ మెట్రోను విక్ర‌యించేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అయింది. ఇటీవ‌ల‌ సంస్థకు భారీగా న‌ష్టాలు వ‌స్తుండ‌డంతో చివ‌ర‌కు హైదరాబాద్ మెట్రోను విక్రయించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఈ ప్ర‌క్రియ‌ను 2026 తర్వాత మొద‌లు పెట్టాల‌ని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌లో 90 శాతం ఎల్‌అండ్‌టీకి ఉండగా, మిగిలిన 10 శాతం తెలంగాణ ప్రభుత్వానిది. మెట్రో వ్యవస్థను నిర్వహించేందుకు  కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందని, ఫలితంగా తీవ్రంగా నష్టాలు వచ్చాయని L&T సంస్థ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ రామన్ అన్నారు. 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో బస్సుల సంఖ్య పెరగనప్పటికీ మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప...
Exit mobile version