తంటాలు తెచ్చిన టమాటా: అడక్కుండా టమాటా వండినందుకు ఇల్లు వదిలి వెళ్లిన భార్య
మార్కెట్ లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న ధరలతో మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అయితే ఈ టమాటానే ఓ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైంది. ఓ వ్యక్తి తన భోజనం తయారీలో కేవలం రెండే రెండు టమాటాలను తన భార్యకు చెప్పకుండా వండాడు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అతడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
టిఫిన్ సెంటర్ నడుపుతున్న సంజీవ్ బర్మన్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల భోజనం వండేటప్పుడు నా భార్యను అడగకుండా రెండు టొమాటోలు వాడడంతో మా మధ్య పెద్ద
గొడవ జరిగింది. టొమాటోల వాడకం గురించి అతని భార్య తనను సంప్రదించకపోవడంతో కలత చెందింది. మూడు రోజులు నాతో మాట్లాడలేదు. ’’ అని తెలిపారు.
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
వాగ్వాదం తర్వాత సంజీవ్ భార్య తమ కుమార...