మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాల(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే మీ ఇంట్లోనే మీరే స్వయంగా మట్టితో చక్కని గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్రహాలు లభించనివారు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచనలు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఆ విగ్రహం తయారీ గురించి తెలుసుకుందామా.. !
మట్టి వినాయక విగ్రహం తయారీకి కావల్సిన పదార్థాలు
మట్టి, నీరు, రంగుల కోసం పసుపు, కుంకుమ
మొదటి దశ:
మీకు అందుబాటులో ఉండే ఏదైనా తోట మట్టిని తీసుకోండి. అది పూర్తిగా ఆరనివ్వండి. అందులో రాళ్లను తొలగించండి. ఈ పొడి మట్టిని జల్లెడ పట్టండి. ...