Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి పర్వదినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించి క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వచ్చాయి.
కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్పష్టత ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెలవులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రో...