Holi: హోలీ ఎప్పుడు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? హిందూ పురాణాల్లో ఉన్న కథ ఇదే..
Holi 2025 Date and Time : రంగుల పండుగ హోలీ భారతదేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అత్యంత ఉత్సాహభరితంగా ఆనందకరంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఆటపాటలతో రెట్టించిన ఉత్సాహంగా జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు. వసంత రుతువును స్వాగతం పలికేందుకు సూచనగా, అలాగే చెడుపై మంచి విజయాన్ని సూచిస్తూ హోలీ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రజల మధ్య ప్రేమ, స్నేహ బంధాలను బలోపేతం చేస్తుంది. రంగులు చల్లుకోవడంతోపాటు రుచికరమైన వంటకాలను ఆస్వాదించడానికి ప్రజలంతా కలిసి వచ్చే సమయం ఇది.
Holi 2025 తేదీ, సమయం
Holi 2025 Date and Time : సాధారణంగా ఏటా మార్చిలో ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 14న హోలీ పర్వదినం ఉంటుంది. చెడుపై విజయానికి ప్రతీకగా హోలీ దహన్ అనే సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ప్రజలు రంగులు, ...