Friday, March 14Thank you for visiting

Tag: hindu temple venfalised

Bangladesh Crisis | బంగ్లాదేశ్ లో ధ్వంస‌మైపోతున్న హిందూ ఆల‌యాలు..

World
Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ మధ్య గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలను దుండ‌గులు ధ్వంసం చేశారు. ఖుల్నా డివిజన్‌లోని మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి అక్క‌డి నుంచి ప‌రారైన త‌ర్వాత‌ ఆందోళనలు మరింత‌ తీవ్రమయ్యాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఇస్కాన్ ప్రతినిధి యుధిస్తిర్ గోవింద దాస్, ఇస్కాన్ దేవాలయాలలో ఒకదానిని ధ్వంసం చేసి, తగులబెట్టినట్లు తెలిపారు. “నాకు అందిన సమాచారం ప్రకారం, మెహర్‌పూర్‌లోని మా ఇస్కాన్ సెంటర్‌లలో ఒకటి (అద్దెకి తీసుకున్నది) జగన్నాథుడు, బలదేవ్, సుభద్రా దేవి దేవతల విగ్ర‌హాల‌ను ధ్వంసం చేసి త‌గులబెట్టారు అని తెలిపారు. ఆ ఆల‌యంలో త‌ల‌దాచుకున్న ముగ్గురు భక్తులు ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డారు " అని గోవింద చెప్పారు. ప్ర‌ధాని హసీనా అధికారం నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో...
Exit mobile version