Hindenburg Research | అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ షట్ డౌన్..
Hindenburg Research | ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌పై (Adani Group) సంచలన ఆరోపణలతో వార్తల్లోకెక్కిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) మరో సంచలన ప్రకటన చేసింది. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ వర్గాల వరకు హిండెన్ బర్గ్ నివేదిక కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్ తో అదానీ షేర్లన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ సంస్థ రిపోర్ట్ భారత స్టాక్ మార్కెట్లను కూడా షేక్ చేసింది. అయితే, తాజాగా ఈ సంస్థ సంచలన నిర్ణయం ప్రకటించింది.
తమ కంపెనీ కార్యలాపాలను మూసివేస్తున్నట్లు (Hindenburg Research shut down) సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) ప్రకటించడం ఇప్పుడు సంచనలంగా మారింది. సంస్థ మూసివేత గురించి తన సన్నిహితులతో గతంలోనే చర్చించినట్లు వెల్లడించారు. అనేక సమీక్షల తర్వాత సంస్థను ష...