Musi River : మూసీ ప్రక్షాళనపై గ్రీన్ సిగ్నల్.. హైకోర్టు కీలక అదేశాలు..
Telangana High Court On Musi River : మూసీ సుందరీకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు మూసీలో కలుషిత నీరు కలవకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది.
మూసీ నది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు ఇవీ
మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్దంగా, అనుమతులులేకుండా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మురుగునీరు, కలుషిత నీరు నదిలో చేరకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఆస్తులు కోల్పోయేవారికి ఆర్థిక చేయూతనివ్వాలని వార...