Tuesday, March 4Thank you for visiting

Tag: heavy rains

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

Telangana
TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే చాన్స్‌ ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే బుధవారం ఆదిలాబ...

AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Andhrapradesh
AP Floods | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర‌రూపం దాల్చుతోంది. దీని కార‌ణంగా సోమవారం నాటికి ఒడిసా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో ఒడిశాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం (సెప్టెంబర్ 8) రోజున ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు (AP Floods) కురిసే చాన్స్ ఉంద‌ని రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన బులెటిన్‌లో తెలిపింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తూర్పుగోదావర...

Weather Report | తెలంగాణలో మరో మూడురోజులు ముసురు..

Telangana
Rains | ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD Weather Report ) వెల్ల‌డించింది. రుతు పవన ద్రోణి జైసల్మేర్‌, రైసేన్‌, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని వివ‌రించింది. దీని ప్ర‌భావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యాపేట, మహబాద్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్...

Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

Telangana
Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి  వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా  వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది. Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా  నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీ...

Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

Telangana
Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ సహా పలు జిల్లాల్లో ఆది, సోమ‌వారాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో చాలా భాగం - సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, ఎల్‌బి నగర్, బాలానగర్, ప్ర‌గతి నగర్, నిజాంపేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి, హైటెక్ కారిడార్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, గోల్కొండ, మణికొండ, టోలిచౌకి, జూబ్లీ హిల్స్‌, షేక్‌పేట్, నానల్ నగర్, బండ్లగూడ, రాజేంద్రనగర్, పాతబస్తీ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చందానగర్, మూసాపేట్, కుసాహిగూడ, చీకలగూడ, జీడిమెట్ల, మర్రెడ్‌పల్లి, ఈసీఐఎల్‌లో భారీ వర్షం పడింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ‌ర్షం కురిసింది. హైదరాబాద్...

Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Telangana
Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది. ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని...

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Andhrapradesh
AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Telangana
Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి. నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది. హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...

Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

Telangana
Rain forecast | భార‌త వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ ప‌రిస్థితులు ఉన్నాయ‌ని భారత వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. మ‌రికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ త‌దుప‌రి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు పవనాలు ఉత్తరం వైపు కదులుతూ.. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది. ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ్‌ మొహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ, దక్షిణ హరియాణా, నైరుతి యూపీ, పంజాబ్‌లో ఐదు నుంచి ఏడు రోజులు భారీగా ఉష్ణోగ్ర‌త‌లు నమోద‌య్యాయని, గరిష్ఠంగా 44-48 డిగ్రీలుగా ఉన్న‌ట్లు తెలిపారు. అసోంలో మే 25-26 తేదీల్లో రికార్...
Exit mobile version