Trains Cancelled | ప్రయాణికులకు గమనిక.. నేడు మరో 20 రైళ్లు రద్దు
Trains Cancelled | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వర్ష బీభత్సానికి వాగులు, నదులు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వే ట్రాక్‌లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.. మరో 160 రైళ్లను దారిమళ్లించగా మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా-బెంగళూరు ఎక్స్ ప్రెస్, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్- త్రివేండ్రం, ఎర్నాకులం-హాతియా, జైపూర్-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్-కోయంబత్తూరు, హాతియా-బెంగళూరు రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు సాయం అందిస్తామని మోదీ ...