Lok Sabha elections 2024 : హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ, ఓటర్ల భద్రత కోసం EC సూచనలు ఇవే..
Heatwave Warning | వేసవిలో తీవ్రమైన ఎండల నుంచి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ జారీ చేసిన విధంగా చేయవలసినవి అలాగే చేయకూడని పనుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC ) జారీ చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఓటర్ల భద్రత కోసం భారత ఎన్నికల సంఘం (EC) మంగళవారం ఒక సలహాను జారీ చేసింది. భారతదేశంలో మార్చి నుంచి మే 2024 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.ఈ నేపథ్యంలోనే ఈసీ ఓటర్లకు కీలక సూచనలు చేసింది.
IMD అంచనాకు సంబంధించి, EC ఒక వివరణాత్మక సలహాను జారీ చేసింది, ఇది హీట్‌వేవ్ ప్రభావాన్ని తగ్గించడానికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నివారించడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (National Disaster Management) జ...