తెలంగాణకు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎంట్రీ
మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ నిర్ణయం
తొలి ఏడాదే 1,200 మంది నిపుణులకు ఉద్యోగాలు
ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు దన్ను
WB discovery development centre : మీడియా, వినోద రంగంలోని ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WB Discovery) తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతోంది. హెచ్ బిఓ (HBO), హెచ్బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టిఎల్ సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే.. గేమింగ్, స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశ...