Wednesday, March 5Thank you for visiting

Tag: Haryana

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Elections
Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు. రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్ కాంగ్రెస్: 55-62 సీట్లు BJP: 18-24 సీట్లు పీపుల్ పల్స్ పోల్ సర్వే కాంగ్రెస్: 44-54 సీట్లు BJP: 15-29 సీట్లు ఇతరులు: 4-9 సీట్లు దైనిక్ భాస్కర్ పోల్ సర్వే ...

Exit Polls 2024 live : జమ్మూకశ్మీర్ హర్యానా ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Elections
Exit Polls 2024 live | హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్నాయి, హర్యానాలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిపోతాయి. ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించనుంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, అనేక వార్తా వేదికలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తాయి. పోలింగ్ ముగిసిన వెంట‌నే అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సార‌మ‌వుతాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎప్పుడు ఎక్కడ‌? యాక్సిస్ మై ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి హర్యానా, J&K ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తుంది. జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, CSDS, C ఓటర్స్‌తో సహా ఇతర పోల్‌స్టర్‌లు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? ఎగ్జిట్ పోల్‌లు సాధారణంగా ఎన్నికల్లో విజేతలను అంచనా వేయడ...

Assembly Elections | మోగిన ఎన్నికల నగారా జమ్మూ కశ్మీర్ లో మూడు దశల్లో, హర్యానాలో ఒక దశలో ఎన్నికలు

Elections
Assembly Elections | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం ప్రకటించింది. ఇది 2014 తర్వాత ఈ ప్రాంతంలో మొదటి ఎన్నికలు జ‌రుగుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు దశల్లో ఎన్నికలు జ‌మ్మూక‌శ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయి; సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 న ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది" అని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు హర్యానాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్ల వివరాలు..  జ‌మ్మూక‌శ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటిలో 74 జనరల్, ఎస్టీలు 9, ఎస్సీ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇక‌ ఓటర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్...

ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

Crime
గత ఏడాది ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 22 ఏళ్ల కామాంధుడికి హర్యానా(Haryana)లోని కైతాల్‌(Kaithal)లోని కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. దోషి, పవన్ కుమార్ అలియాస్ మోని, ఊరగాయల వ్యాపారి. కాగా పవన్ కుమార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు దీనిని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పేర్కొంది. "ఇలాంటి అసహ్యకరమైన, హేయమైన చర్యకు పాల్పడే వ్యక్తికి జీవించే హక్కు లేదు" అపరాధి బాలికపై క్రూరంగా ప్రవర్తించిన తీరు సహించలేనిది." అని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గగన్‌దీప్ కౌర్.. ఉరి శిక్షను ఖరారు చేస్తూ వ్యాఖ్యానించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మృతురాలి కుటుంబీకులకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక పోక్సో కోర్టు ప్రకటించింది . "దాడి క్రూరత్వం, చనిపోయిన చిన్నారిపై అత్యాచారం, హత్య, దహనం చేసిన అనాగరిక విధానం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదనను...

నుహ్ లో నేడు వీహెచ్ పీ శోభాయాత్ర : అనుక్షణం టెన్షన్.. టెన్షన్.. భారీ భద్రత, ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు..

National
Nuh Shobha Yatra : హర్యానాలోని నుహ్ జిల్లాలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ సోమవారం 'శోభా యాత్ర’ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యలో స్థానిక యంత్రాంగం భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరించింది. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠినమైన చర్యలను తీసుకుంటోంది. పోలీసు అనుమతి నిరాకరించినప్పటికీ, విశ్వహిందూ పరిషత్ (VHP) ఊరేగింపును నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నందున పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. దీంతో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్ 144 విధించింది. నుహ్ జిల్లాలో ఎక్కడా గుమిగూడొద్దని ప్రజలను కోరింది. సెక్షన్ 144 విధింపు నుహ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అశ్విని కుమార్, జిల్లాలో సెక్షన్ 144 విధించినట్లు ప్రకటించారు. శోభాయాత్రకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బ్యాంకులను మూసి వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. యాత్రను ప్రచారం చేసేవారు సెక్...

సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..

Special Stories
పురాతన కాలం నుంచి హనుమాన్ చాలీసా హిందూ సంస్కృతిలో ఓ భాగమైంది. ఆంజనేయస్వామిని ఆరాధించే వారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేస్తారు. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలను కలిగి ఉంటుంది. అయితే భక్తుడు కేవలం ఒక్క సెంటీమీటర్ ఉన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాశాడు. హరియాణాలోని హిస్సార్ కు చెందిన జితేంద్ర పాల్ సింగ్ ఒక సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసాను రాశాడు. జితేంద్రపాల్ సింగ్ అత్యంత సూక్ష్మమైన 15 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ప్రతీ పేజీ ఒక సెంటీమీటర్ పొడవు, అర సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. అంతేకాదు ఈ పుస్తకం కవర్ పేజీపై పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్న హనుమంతుడి చిత్రపటాన్ని కూడా చిత్రీకరించాడు. ఈ పుస్తకాన్ని దెబ్బతినకుండా రక్షించడానికి లామినేట్ కూడా చేశాడు. ఈ హనుమాన్ చాలీసా మినియేచర్ వెర్షన్ రాయడానికి తనకు 15 రోజులు పట్టిందని జితేంద్ర పాల్ సింగ్ వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రజలు ఎక్కడికైనా సు...

ఎమ్యెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ

National
కైతాల్: హర్యానాలోని కైతాల్ జిల్లాలో ఓ మహిళ ఆగ్రహంతో ఎమ్మెల్యేను చప్పుతో కొట్టడం కలకలం రేపింది. జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) కి చెందిన ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ కైతాల్‌లోని గుహ్లా ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తుండగా ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకోగా ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. నీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలతో విసుగు చెంది ఆగ్రహంతో అక్కడి జనం ఉన్నారు. ఇళ్లు, ఆహారం, వరద సమస్యలతో అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని Jannayak Janta Party  ఎమ్మెల్యేను నిలదీశారు. ఇంతలో ఆగ్రహించిన ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, మహిళతోపాటు ఇతర స్థానికులు "ఇప్పుడు ఎందుకు వచ్చారు?" అంటూ ప్రశ్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్...

భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం

National
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత  రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు. ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో ఎనిమిది, హర్యానాలో ఐదు బృందా...
Exit mobile version