Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్..!
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..!
Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్ భార్యతో కలిసి ఇటీవల Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు.
డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్ ప్రసాద్ తలక...