రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?
గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..?
ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం..
పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది.
కాగా 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది.
పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970...