Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ 'ధైర్య పోరాటం' చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.రాహుల్ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా "spoon-fed kids" అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు.
"రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఆయన చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారి...