Wednesday, April 30Thank you for visiting

Tag: Gaza

All eyes on Rafah | సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఆల్ ఐస్ ఆన్ రాఫా..

World
All eyes on Rafah | ఇజ్రాయెల్ దాడిలో 45 మంది పౌరులు మరణించిన తర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇపుడు అంద‌రి దృష్టి రఫాపై ఉంది. మే 26న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోని రఫాలోని  టెంట్ క్యాంపులో  భారీ అగ్నిప్రమాదం సంభవించి 45 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్‌పై దాడులకు కార‌ణ‌మైన ఓ అధికారితో పాటు వెస్ట్ బ్యాంక్‌కు హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ను అంత‌మొందించేందుకు ఈ దాడి చేప‌ట్టిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇది ఒక విషాదకరమైన తప్పిదంగా ప్రకటించింది. రఫాపైనే అందరి దృష్టి.. ఆల్ ఐస్ ఆన్ రాఫా ' అనేది గాజా నగరంలో జరుగుతున్న మారణహోమాన్ని ప్ర‌తిబింబించే పదబంధం. ఇజ్రాయెల్ దాడులతో ప్రభావితమైన పాలస్తీనియన్లకు ప్రపంచవ్యాప్త మద్దతు లభించడంతో ఈ పదబంధం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ప్రముఖులు మద్దతుగా సందేశాలను పంచుకున్నారు. ప్రియాంక...

రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?

Trending News
గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..? ఇజ్రాయెల్‌- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం.. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది. కాగా 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది. పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970...

మా వేళ్లు ట్రిగ్గర్ మీద రెడీగా ఉన్నాయి… ఇజ్రాయెల్ కు ఇరాన్ తీవ్ర హెచ్చిరిక

World
న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్‌ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి" అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు. గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది. ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, "పరిస్థి...

Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Trending News, World
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ  జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు. కాగా హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మ...
Exit mobile version